*_పండుగ సాయన్న జయంతికి ముదిరాజులు అధిక సంఖ్యలో తరలి రావాలి_* *- తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ బోళ్ళ కరుణాకర్ ముదిరాజ్*
సూర్యాపేట: ఈ నెల 22న జిల్లా కేంద్రంలో నిర్వహించే తెలంగాణ రాబిన్ హుడ్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న జయంతికి జిల్లాలోని ముదిరాజ్ లు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని *తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ బోళ్ల కరుణాకర్ ముదిరాజ్* పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ప్రజావీరుడు, తెలంగాణ రాబిన్ ఫుడ్, బీసీల బంధువు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి గోడ పత్రికలు ముదిరాజ్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల పై నాటి దొరలు, భూస్వాములు, సంపన్న వర్గాలు చేస్తున్న ఆకృత్యాలను ఎదిరించిన మహనీయుడు...