*సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి* *పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు యలగబోయిన మధు యాదవ్*

సూర్యాపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు యలగబోయిన మధు యాదవ్ పట్టభద్రుల ను కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 11వ వార్డు రాయినిగూడెంలో పట్టభద్రుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాలగబోయిన మధు యాదవ్, సింగం నరేష్, పల్లపు భాస్కర్, నామ రాజశేఖర్, ఎల్లంల లింగయ్య, నల్ల మేకల...