ఘనంగా ముత్యంరాజు దంపతుల సిల్వర్ జూబ్లీ వివాహ వేడుక
శాలిగౌరారం : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగు ముత్యం రాజు స్వాతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఊట్కూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు పులి రామకృష్ణ శర్మ వేద ఆశీర్వాదంతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2001 అక్టోబర్ 18 తేదిన జరిగిన వారి వివాహము నేటికీ 25 సంవత్సరాలు అయుంది. దింతో ఊట్కూరు గ్రామం లోని వారి స్వగృహం లో బంధు మిత్రుల సమక్షంలో వారి ఇరువురు కుమార్తె లు సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవం గా జరిపారు . ఈ సందర్బంగా పలువురు వారికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ శాలువా...