*హైకోర్టు ఉత్తర్వులతో వజ్ర రైస్ మిల్ పునఃప్రారంభానికి సిద్ధం* రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం *వట్టే జానయ్య యాదవ్*

సూర్యాపేట: రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన వజ్ర రైస్ మిల్‌ను తిరిగి ప్రారంభించేందుకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని బీసీ ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామం వద్ద గల వజ్ర రైస్ మిల్లులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం, విజిలెన్స్ అధికారుల కేసులు, ఆరోపణలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యులతో పాటు మిల్ సిబ్బందిని కూడా జైలుకు పంపించారని పేర్కొన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి మిల్లును నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు సహకరించడం లేదని...