*శ్రీ మహా చండీ దేవి గా భక్తులకు దర్శనం ఇచ్చిన సంతోషి మాత*
సూర్యాపేట టౌన్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4 వ రోజు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషి మాత అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ చండీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.భవాని దీక్ష ధారణ భక్తులకు పూజలతో పాటు చండీ హోమం,రుద్ర హోమం నిర్వహించారు. శ్రీ చండీ మాత అలంకార భక్తులకు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామునే అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్ర యంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల భాగంగా బ్రాహ్మణ ముత్తైదువకు సుహాసిని పూజ, శివలింగాకృతిలో దీపోత్సవం...