మౌళిక వసతుల కల్పనకు కృషి

సూర్యాపేట : మున్సిపాలిటీలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మొరిశెట్టి నివేదితలక్షాది అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 11వ వార్డు రాయినిగూడెంలో మున్సిపల్‌ నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. అంచెలంచెలుగా అన్ని వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ షఫి ఉల్లా, కౌన్సిలర్‌లు ఎల్గూరి ఇందిర వీరయ్య, హేమ, వేణు, నాయకులు ఎలగబోయిన మధు యాదవ్‌, కొప్పుల రాంరెడ్డి, చిత్తలూరి కృష్ణ తదతరులు పాల్గొన్నారు.