తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకై నిరంతర పోరాటం చేస్తా.. *ధర్మార్జున్*

సూర్యాపేట : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు,భారత రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేస్తానని. ఎన్నికల్లో కూడా పోటీ చేసి చట్టసభల్లో ఆ లక్ష్యంగా పనిచేస్తానని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంట్ల ధర్మార్జున్ ప్రకటించారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహావీర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని శత్రుదాడు లను పోలీసు నిర్బంధాన్ని తట్టుకొని నిలబడ్డానని జయశంకర్ సార్ కోదండరా సార్ మార్గదర్శకత్వంలో సుధీ ర్ఘ కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పనిచేశామని అన్నారు. ఇప్పుడు...