కాసరబాద గ్రామంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం.. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి
సూర్యాపేటరూరల్ : ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ కోతి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగాని సైదులు, ఉపసర్పంచ్ పూజల రవి, వార్డు మెంబర్లు, యువత, ఓటర్లు పాల్గొన్నారు.