*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ అవగాహన*

సూర్యాపేట రూరల్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరుతూ... సూర్యాపేట మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా నాయకులు, మాజీ జడ్పీటీసీ జీడి బిక్షం, ఈదుల యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బీరవోలు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ప్రజాస్వామ్యంలో ప్రతి గ్రాడ్యుయేట్‌కు ముఖ్యమైన బాధ్యత అని అన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత...