60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం: మునగాలలో రూ. 9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్ అక్టోబర్‌ 6న శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సూర్యాపేట, అక్టోబర్‌ 4: సూర్యాపేట జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించేందుకు మునగాల మండలంలో రూ. 9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మునగాల మండలంలో జాతీయ రహదారి పక్కన, మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో ఈ కేంద్రీకృత వంటశాలను నిర్మించనున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే కేంద్రం నుంచి ఆహారం తయారు చేసి, ప్యాకింగ్‌,...