విజయవాడ గురుస్వాముల సమ్మేళనం లో ముత్యంరాజు కు ఘనంగా సన్మానం

సూర్యాపేట : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్.రంగు ముత్యంరాజు గురుస్వామి ని విజయవాడ నగరం లో జరిగిన గురుస్వాముల సమ్మేళనం లో ఘనంగా సన్మానించారు. విజయవాడ నగరం ఏ వి ప్యాలెస్ లో ఆదివారం అయ్యప్ప మహా సంకల్పం శంఖరావం కార్యక్రమం సందర్బంగా గురుస్వాముల సమ్మేళనం ను మహా సంకల్ప కార్యనిర్వాహక కమిటీ వారు నిర్వహించారు.ఈ సందర్బంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి డాక్టర్ రంగు ముత్యం రాజు గురుస్వామి ఇట్టి సమావేశం నకు అయ్యప్ప ధర్మ ప్రచార సభ ద్వారా హాజరైనారు. ఈ సందర్బంగా వారిని కమిటీ చైర్మన్ సి ఏ సుంకరి అక్కయ్య నాయుడు, ఏ...