*నవంబర్ 15–18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలి* *అక్టోబర్ 6 నుండి మహాసభల విజయవంతానికై నిధుల సేకరణ ను జయప్రదం చేయండి.* *సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి*
సూర్యాపేట: నవంబర్ 15 నుండి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డిపిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు.నల్లగొండ జిల్లాకు రైతాంగ పోరాటాల చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్లగొండ ప్రాంతం అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని తెలిపారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతాంగం సాగించిన...