*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి* *టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు*

ముఖ్యమైన పాయింట్స్:*టియూడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష, సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత* సూర్యాపేట: దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టి యు డబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం టియుడబ్ల్యూజే (ఐజేయు) దేశవ్యాప్త డిమాండ్ల డే నిర్వహించాలన్న పిలుపుమేరకు ఎంజి రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టి, కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు రాసిన వినతి పత్రాన్ని...