సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, ఈ డిమాండ్ సాధనకు భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతా రెడ్డిని శుక్రవారం సూర్యాపేటలోని బిజెపి జిల్లా కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాలని, జిల్లాలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను నిర్మించాలని కోరారు. సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఈ...