*జర్నలిస్ట్ లు సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తరలిరావాలి* *టి యు డబ్ల్యూ జె ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు*

సూర్యా పేట: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జే యు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం చేపట్టే ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హాజరై జయప్రదం చేయాలని టియు డబ్ల్యూ జె, ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో గురువారం టి యు డబ్ల్యూ జె ఐజెయు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై గాంధీ జయంతి సందర్భంగా ఎంజి రోడ్ లోని మహాత్మా...