రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి ఎం సి పి ఐ యు

సూర్యాపేట టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఎం సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎం సి పి ఐ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం సూర్యాపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎం ఆర్ ఓ కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందారని, హామీలలో భాగంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు పెంచాలని, దసరా పండుగ కానుకగా అందించాలన్నారు. మహిళలకు 2,500...