గణేష్ నవరాత్రులతో సూర్యాపేటకు ఆధ్యాత్మిక శోభ -గణేష్ నవరాత్రుల్లో ఉత్సవ కమిటీల సేవలు అభినందనీయం
ముఖ్యమైన పాయింట్స్:14వ వార్డులో గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేసిన ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట: కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలతో సూర్యాపేటలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో కాంగ్రెస్పార్టీ వార్డు ఇంచార్జీ, జిల్లా నాయకులు పంతంగి దశరథ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గణేష్ నవరాత్రులు మొదలుకొని చివరి రోజు వరకు ఉత్సవ కమిటీలు భక్తులకు అందించే సేవలు అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలతో ప్రతి...