22-ఏ భూములపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధపడాలి ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేయొద్దు: పటేల్ రమేష్‌రెడ్డి

సూర్యాపేట: 22-ఏ నిషేధిత భూముల అంశంపై శాసనసభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు కూడా చర్చకు రావాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇబ్బందులు లేకుండా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు...