ఖమ్మంలో జరిగే ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి. సెప్టెంబర్ 28న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరండి..
సూర్యాపేట : సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సూర్యాపేట మండల పరిధిలోని రామచంద్రాపురం, రత్నాపురం గ్రామాల్లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయకరంగాన్ని దివాలా తీపించి మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయకరంగాన్ని బౌల జాతి కంపెనీలకు అంబానీ ఆదానీలకు కట్టబెడుతుందని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని,యూరియా యాప్ ను రద్దు చేయాలని, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల...