పట్టణ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..

సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో శుక్రవారం నాడు జరిగిన బందుకు పూర్తిగా సహకరించిన వర్తక వ్యాపార వర్గాలకు మరియు హోటల్స్ యజమానులకు మెకానిక్ లకు బందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బుల్లెట్ ట్రైన్ సాధన సమితి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.శనివారం సుధా బ్యాంకు ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎండలను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు బందులో పాల్గొన్నారని తెలిపారు‌ సూర్యాపేట ప్రజల ఐకమత్యాన్ని ఈ బందు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశామని, బంధు కు మద్దతుగా నిలిచిన పాఠశాల కళాశాలల యజమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేశారు....