*బుల్లెట్ ట్రైన్ సాధనే లక్ష్యంగా ఉద్యమిద్దాం*.... బుల్లెట్ దీక్షలు ప్రారంభించి మాట్లాడిన పటేల్ రమేష్ రెడ్డి.

సూర్యాపేట: సూర్యాపేటకు ముందుగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ జాతీయ రహదారి 65 మీదుగా అలాట్మెంట్ చేసే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఏర్పాటు చేసిన 36వ రోజు శుక్రవారం ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు దీక్షలో పాల్గొనగా దీక్షలు ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత 60 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ 36 రోజులుగా దీక్ష చేస్తున్న పాలకులు పట్టించుకోక విచారకరమన్నారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చుట లో పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష...