🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 5:06 pm Posted by : RK SAKSHI

*దేశ చరిత్రలో చెరగని సంతకం.. ఇందిరాగాంధీ* *ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి ఘన నివాళి*

News Image

సూర్యాపేట: దేశ చరిత్రలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీది చెరగని స్థానమని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వారి నివాసంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివని, ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, కాంగ్రెస్ నాయకులు ఫరూఖ్, పాలగాని కృష్ణ, తండు శ్రీనివాస్, బంటు చొక్కయ్య, యట వెంకన్న, నేరేళ్ల మధు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home