🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 October 2026, 3:54 pm Posted by : RK SAKSHI

*పేదింటి గడపకు చేరుతున్న ఇందిరమ్మ ఇల్లు*

News Image

సూర్యాపేట: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని 22వ వార్డు రాజీవ్ నగర్‌లో కౌన్సిలర్ ఎల్గూరి అలివేలు చంటిబాబుతో కలిసి తండు అంజలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు నాగుల వాసు, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home