🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 5:41 pm Posted by : RK SAKSHI

*మూసి నీటిని క్రమబద్ధీకరించాలి.* *తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి*

News Image

సూర్యాపేట : మూసి నీటిని క్రమబద్ధీకరించి రైతాంగానికి రెండో పంటకు నీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కోరారు. బుధవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మూసి ప్రాజెక్టు ఎస్ సి నాగభూషణ రావు కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి ప్రాజెక్టు ద్వారా నీరు ఎక్కువ మొత్తంలో విడుదల చేయటం వల్ల రెండవ పంటకు సాగునీరు అందే పరిస్థితి ఉండదని దీని మూలంగా రైతాంగ రెండవ పంటకు సాగునీటికి ప్రమాదం ఉందని ప్రభుత్వం తక్షణమే మూసి నీటిని క్రమబద్ధీకరించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా నాయకులు వీరబోయిన రవి, వేల్పుల వెంకన్న, వెలుగు మధు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home