🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 October 2026, 12:56 pm Posted by : RK SAKSHI

- *పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి.* - *పోలీసు త్యాగాలకు గౌరవంగా ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి.* నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా. *బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న పట్టణ పౌరులు, యువత*

News Image

సూర్యాపేట :
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఖమ్మం చౌరస్తా నుండి పిఎస్ఆర్ సెంటర్, కోర్టు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా వరకు పోలీసు అమరుల సంస్మరణ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అధికారులతో కలిసి జిల్లా కేంద్రం లోని ఖమ్మం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించారు. పిఎస్అర్ సెంటర్, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వరకు జరిగినది. ఎస్వీ కళాశాల వద్ద పౌరులతో కలిసి జై జావాన్ , జై కిసాన్, జై పోలీస్ అంటూ, పోలీసు అమరవీరుల ఆశయాలను సాధిస్తాం అని పౌరులతో కలిసి నినాదాలు చేశారు. అమరుల స్మారకార్థం ఘనంగా నివాళి ఘటించారు. ఈ సందర్బంగా ఎస్పి నరసింహ మాట్లాడుతూ... అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియజేయాలని సదుద్దేశంతో మరియు పోలీసులు చేసే కఠినతరమైన విధులను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పౌరుడు పోలీసు
అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, పోలీసు త్యాగాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. పోలీసు అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ.. నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా ఉండటానికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, అర్ముడ్ డిఎస్పీ నరసింహ చారి, సిఐ లు రాజశేఖర్, వెంకటయ్య, రామారావు, శివ కుమార్, ఆర్ఐ లు నారాయణ రాజు, ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐ సురేష్, ఎస్ఐ లు సందీప్, సాయిరాం, మహేష్, రహీముద్దిన్, కనకరత్నం, పోలీస్ సంఘం అధ్యక్షులు రమేష్, సెక్రెటరీ కిరణ్, యువత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home