రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:ఈ ఏడాది వరి ధాన్యానికి క్వింటాల్ కు 3వేలు పైచిలుకు పైగా మద్దతు ధరఐదు రూపాయల భోజనం పరిశీలన
సూర్యాపేట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేశానికి వెన్నెముకైన రైతాంగానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 78 వేల వరి ధాన్యం వచ్చినా గాని వరి ధాన్యానికి మూడు వేలకు పైచిలుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు కల్పిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఐదు రూపాయల భోజనం ఏర్పాట్లు, రైతుల కల్పిస్తున్న మద్దతు ధర గురించి సోమవారం రైతులను అడిగి తెలుసుకుని మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మార్కెట్ కి వచ్చిన రైతాంగానికి ఐదు రూపాయలకే అన్నదాతలకే అన్నం పెట్టేలా మాకు అవకాశం కల్పించిన దివంగత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లు సుమారు 800 మంది రైతులకు ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్నామని ,రైతులు సంతృప్తిగా రుచికరంగా ఉందని చెప్పారని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ సహకారంతో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులకు మద్దతు ధర విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర కల్పించాలని మార్కెట్ సెక్రెటరీని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ కరీం, మార్కెట్ కమిటీ సెక్రటరీ పసియోద్దీన్, సిబ్బంది ఖాసీం, ఐఎన్ టియుసి సెక్రెటరీ గౌస్, రాపర్తి నాగరాజు, నర్సింగ్ కిరణ్, రావుల రమేష్, బూర సత్యనారాయణ, అనంతుల నవీన్, తదితరులు పాల్గొన్నారు.