కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది పేటలో అలరించిన స్వర గానామృతం గాయకులకు షీల్డ్ లు అందజేసి సత్కరించిన ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్
సూర్యాపేట :
సమాజంలో అంతరించిపోతున్న కలలకు జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేడు ఆపాత మధురాలను గుర్తు చేస్తూ స్వర గానామృతం నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో జ్ఞాన సరస్వతి కళావేదిక, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర గానామృతం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి గాయకులకు షీల్డులు ప్రశంస పత్రాలు అందజేసి సత్కరించారు. ఆనాటి పాటలు ఎంతో మధురమైనవని చెవులకు వినసొంపుగా ఉండే ఆ పాత మధురాలను మళ్లీ వినిపించిన జ్ఞాన సరస్వతి కళావేదికను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ఆహ్వానించడంలో సూర్యాపేట ప్రజలు ముందు వరసలో ఉంటారని అన్నారు. భవిష్యత్తులో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హమీద్ ఖాన్, జైలు సూపరిండెంట్ సుధాకర్ రెడ్డి, వల్లపట్ల దయానంద్, ఇరిగి కోటేశ్వరి, బాల కేంద్రం సూపరిండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, డాక్టర్ గోపి, దాసరి సత్యం, అరవింద శర్మ, అబ్రహం ప్రముఖ గాయని గాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.