🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 22 October 2026, 6:03 pm Posted by : RK SAKSHI

*ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు కావాలి* తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

News Image

సూర్యాపేట: అర్హులైన ప్రతి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదితతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించడంతో పాటు, నమోదు ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు తెలిపి, ఆయన విజయానికి కృషి చేయాలని పట్టభద్రులను కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, వార్డు కౌన్సిలర్లు నాగుల వాసు, పాలగాని కృష్ణ, కాంగ్రెస్ నాయకులు సైదిరెడ్డి, ధర్మా నాయక్, వల్దాసు దేవేందర్, తండు శ్రీనివాస్, అరవింద రెడ్డి, లింగరాజు, పిల్లల వెంకన్న, జాకబ్, మేరెడ్డి ఉపేందర్, జోగం సైదులు, భూక్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home