🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 19 October 2026, 9:05 pm Posted by : RK SAKSHI

*చెడుపై మంచి సాధించిన* *విజయమే విజయదశమి* *తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ* *దసరా* *పండుగ* *శుభాకాంక్షలు* తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

News Image


సూర్యాపేట :

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి వేదికగా ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చరిత్ర ఇతిహాసాలు పురాణాల ఆధారంగా చెడుపై మంచి సాధించినందుకు సంకేతం గానే ప్రజలు విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవరాత్రిఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం గొప్ప విషయం అన్నారు. సమాజం లో దైవ అనుగ్రహంతోనే మానవజాతి మనుగడ ఉంటుందని పంతంగి వీరస్వామి గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా విజయదశమి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జమ్మి చెట్టు కొమ్మ పాలపిట్ట ల సాక్షిగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందోత్సవాలు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు పంతంగి వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్ కుమార్,జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ రియల్ ఎస్టేట్ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, జిల్లా రియల్ ఎస్టేట్ ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పట్టేటీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home