*_పండుగ సాయన్న జయంతికి ముదిరాజులు అధిక సంఖ్యలో తరలి రావాలి_* *- తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ బోళ్ళ కరుణాకర్ ముదిరాజ్*
సూర్యాపేట: ఈ నెల 22న జిల్లా కేంద్రంలో నిర్వహించే తెలంగాణ రాబిన్ హుడ్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న జయంతికి జిల్లాలోని ముదిరాజ్ లు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని *తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ బోళ్ల కరుణాకర్ ముదిరాజ్* పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో ప్రజావీరుడు, తెలంగాణ రాబిన్ ఫుడ్, బీసీల బంధువు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి గోడ పత్రికలు ముదిరాజ్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల పై నాటి దొరలు, భూస్వాములు, సంపన్న వర్గాలు చేస్తున్న ఆకృత్యాలను ఎదిరించిన మహనీయుడు సాయన్న అని అన్నారు. నాటి రోజుల్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ధరలు, భూస్వాముల ధాన్యగారాలపై దాడులు చేసి ధాన్యం తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చిన యోధుడన్నారు. సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూడలేక స్వంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి నాడు ఆధిపత్యం చెలాయిస్తున్న వారిపై పోరాటాలు నిర్వహించిన యోధుడు సాయన్న అని గుర్తు చేశారు. అంతేకాకుండా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా బహుజనులను ఐక్యం చేసిన సాయన్నను నాటి పెత్తందారులు ఎన్నో ఇబ్బందులకు గురిచేసి నిజాంపై ఒత్తిడి తీసుకువచ్చి అరెస్టు చేసి జైలు కు పంపిన భయపడకుండా సామాన్య ప్రజల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారని అన్నారు. అలాంటి మహానేత ముదిరాజ్ సామాజిక వర్గంలో ఉండడం గర్వకారణమని చెప్పారు. సాయన్న జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ మహానాయకుడు జయంతికి జిల్లాలోని ప్రతి ముదిరాజ్ ఇంటి నుండి ఒక్కొక్కరిగా తరలివచ్చి ఘనంగా నివాళులర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెమ్మికల్ ముదిరాజ్ సొసైటీ చైర్మన్ జంగా వెంకటేశ్వర్లు ముదిరాజ్, ఉపాధ్యక్షులు నార్ల రమేష్ ముదిరాజ్, గాంధీనగర్ ముదిరాజ్ సొసైటీ చైర్మన్ కోదాటి శ్రీను ముదిరాజ్, జిల్లా నాయకులు అంకిరెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, నీలం రాములు ముదిరాజ్, సందన బోయిన కిరణ్ ముదిరాజ్, భాష బోయిన పరమేష్ ముదిరాజ్, మట్టపల్లి వెంకన్న ముదిరాజ్, కన్నెబోయిన పుల్లయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.