🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 19 October 2026, 1:57 pm Posted by : RK SAKSHI

పుట్టినరోజున అన్నదానం చేయడం అభినందనీయం కౌన్సిలర్ ఎలుగూరి అలివేలు చంటిబాబు

News Image

సూర్యాపేట రూరల్: పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమని కౌన్సిలర్ ఎలుగూరి అలివేలు చంటిబాబు అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాపర్తి శ్రీనివాస్ కుమారుడు రాపర్తి రోహిత్ జన్మదిన సందర్భంగా గాంధీ నగర్ సమీపంలోని స్నేహ నిలయంలో అన్నదానం చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రాపర్తి రజిని, రాపర్తి శివ సాకేత్, రాపర్తి మహేష్ కుమార్, గుండగాని సుజాత, లల్లు, విష్ణు, మహేష్, శివ గణేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home