ఘనంగా ముత్యంరాజు దంపతుల సిల్వర్ జూబ్లీ వివాహ వేడుక
శాలిగౌరారం :
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగు ముత్యం రాజు స్వాతి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఊట్కూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు పులి రామకృష్ణ శర్మ వేద ఆశీర్వాదంతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2001 అక్టోబర్ 18 తేదిన జరిగిన వారి వివాహము నేటికీ 25 సంవత్సరాలు అయుంది. దింతో ఊట్కూరు గ్రామం లోని వారి స్వగృహం లో బంధు మిత్రుల సమక్షంలో వారి ఇరువురు కుమార్తె లు సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవం గా జరిపారు . ఈ సందర్బంగా పలువురు వారికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ శాలువా తో ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమం లో ఊట్కూరు గ్రామ సర్పంచ్ శీలం అనిత శంకర్, ఉపసర్పంచ్ రంగు రాములు గౌడ్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి బుడిగే శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు వేముల పర్వతాలు, రాములు, దేవాలయం కమిటీ సభ్యులు గుండ్ల శ్రీనివాస్, కప్పల చంద్రశేఖర్,కే బ్రహ్మ చారి, భూపతి సత్యనారాయణ, ఏ యాదగిరి, రంగు వీరు, రంగు బిక్షం, పూర్ణయ్య, కుర్ర గణేష్, రంగు గణేష్, తదితరులు పాల్గొన్నారు.