బాలెంల మంజిత్ కాటన్ కంపెనీలో పత్తి కొనుగోలు ప్రారంభం
సూర్యాపేటరూరల్ :
పత్తి పండించిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామం వద్దగల మంజిత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని కంపెనీ మేనేజ్మెంట్ మారేపల్లి ప్రభాకర్ బుధవారం తెలిపారు. పత్తి పండించిన రైతులు కంపెనీకి తీసుకువచ్చి మంచి ధరను పొందవచ్చని వెల్లడించారు. ఈ అవకాశాన్ని పత్తి పండించిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.