🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 12 October 2026, 7:29 pm Posted by : RK SAKSHI

డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగు చేసుకోవాలి జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య

News Image

చివ్వేంల :

ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను రైతులు సాగు చేసుకుని ఆర్థికనీగా అభివృద్ధి చెందాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. చివ్వేంల మండలం అక్కలుదేవి గూడెం గ్రామం లో నూతనంగా 3ఎకరాలలో
సాగు చేస్తున్న ఎర్రంశెట్టి హేమలత వ్యవసాయ క్షేత్రం లో ఆయిల్ పామ్ తోటల మొక్కలు నాటే కార్యక్రమంను
సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి మంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూ.4,200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహం ఇస్తుందని, గరిష్టంగా ఒక రైతుకు 12 ఎకరాల వరకు డ్రిప్పు రాయితీ
కూడా లభిస్తుందని, నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు
చేయాలని రైతులకు సూచించారు.ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ అలీమ్,
సూర్యాపేట డివిజన్
ప్రాంతీయ ఉద్యాన అధికారిని కట్ట స్వాతి,
ఉద్యాన విస్తరణ అధికారి యానాల సుధాకర్ రెడ్డి ఆయిల్ ఫెడ్ సిబ్బంది గోపి కృష్ణ, లక్ష్మి నారాయణ రైతు కృష్ణా రావు తదితరులు ఉన్నారు.
🏠 Home