తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకై నిరంతర పోరాటం చేస్తా.. *ధర్మార్జున్*
సూర్యాపేట :
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకు,భారత రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేస్తానని. ఎన్నికల్లో కూడా పోటీ చేసి చట్టసభల్లో ఆ లక్ష్యంగా పనిచేస్తానని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంట్ల ధర్మార్జున్ ప్రకటించారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహావీర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని శత్రుదాడు లను పోలీసు నిర్బంధాన్ని తట్టుకొని నిలబడ్డానని జయశంకర్ సార్ కోదండరా సార్ మార్గదర్శకత్వంలో సుధీ ర్ఘ కాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పనిచేశామని అన్నారు. ఇప్పుడు నాయకులుగా అధికారం చలాయిస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఉద్యమంలో లేరని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కొరకు మీటింగ్లు పెడుతుంటే అడ్డుకున్న వాళ్లే అవహేళన చేసిన వాళ్లే ఈరోజు అధికార ఆర్భాటం అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో యువతను సమీకరించుట కొరకు హాండ్ మైకు సైకిల్ మోటార్ కు కట్టుకొని తిరుగుతూ నియోజకవర్గ మొత్తం గ్రామ గ్రామాన మీటింగ్లు పెట్టామని పాదయాత్ర నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. గత పదేండ్ల పాలనలో టిఆర్ఎస్ అనుసరిoచ్చిన ప్రజా వ్యతిరేక అప్రజా స్వామిక అవినీతి పాలన కు వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి పోరాటం నిర్వహించింది నాడు తెలంగాణ ఉద్యమంలో గాని కేసీఆర్ వ్యతిరేక ఉద్యమంలో గానీ అడ్రస్ లేని వాళ్లంతా నేడు అధికార o చెలయిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. 2028 ఎన్నికల్లో తెలంగాణ జనసమితి సూర్యాపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తుందని గెలిచి తీరుతుంది అని ఆయన అన్నారు. కార్యకర్తలు నాయకులు నిరంతరం క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలపై పోరాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చినప్పటికి ప్రజా సమస్యల పై పోరాడకూడదు అని ఏమిలేదు. ఖచ్చితంగా పోరాటం కొనసాగించాల్సిందే నని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గట్ల జిల్లా అధ్యక్షులు గట్ల రమా శంకర్ మాట్లాడుతూ కార్యకర్తలను నిరంతరం అంటిపెట్టుకొని ఉండే ధర్మంజు నాయకత్వంలో పనిచేయడం తమకు ఎంతో ధైర్యాన్నిస్తుందని అన్నారు. యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ కిరణ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ ధన బలంతో వచ్చే జన బలం నిలబడదని ప్రజాపోరాటాల ద్వారానే జనాభలాన్ని నిర్మించుకోవచ్చని దానికి నిదర్శనమే ధర్మార్జున్ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కొంచెం చంద్రకాంత్ రైతు జన సమితి జిల్లా అధ్యక్షులు కొల్లు కృష్ణారెడ్డి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి గోపి యువజన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగు నాయక్ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ ఎస్ టి సెల్ జిల్లా బాధ్యులు పొనుగోటి సూర్యనారాయణ నాయక్ మైనార్టీ సెల్ బాధ్యులు పరిరుద్దీన్, సామ శ్రీనివాస రెడ్డి,ఈశ్వర్ సింగ్ యాకుబ్ రెడ్డి, వల్కి గోవర్ధన్, జ్జవ్వాది సతీష్, బొజ్జ అనిల్, మాతంగి గోపి, బొజ్జ భరత్, ప్రేమకుమార్ సాగర్ రెడ్డి, మున్నా మధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జనసమితి నాయకులు కార్యకర్తలు ధర్మార్జున్ ని షాలువాలతో సత్కరించారు.