🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 9:06 am Posted by : RK SAKSHI

*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ అవగాహన*

News Image

సూర్యాపేట రూరల్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరుతూ... సూర్యాపేట మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా నాయకులు, మాజీ జడ్పీటీసీ జీడి బిక్షం, ఈదుల యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ బీరవోలు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ప్రజాస్వామ్యంలో ప్రతి గ్రాడ్యుయేట్‌కు ముఖ్యమైన బాధ్యత అని అన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత Form-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు ప్రక్రియ, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు సమర్పించే విధానం తదితర అంశాలను కార్యక్రమంలో వివరించారు. గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడికి ఈ విషయంపై అవగాహన కల్పించి, ఓటరు జాబితాలో తమ పేరు నమోదయ్యేలా సహకరిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్ర పరమేష్, సూరం లక్ష్మికాంత్ రెడ్డి, యరకల సూర్యానారాయణ గౌడ్, సాంబార్ చంద్రశేఖర్, పోలెపాక శ్యాంసుందర్, ఈదుల సైదులు, పల్స కృష్ణయ్య, గోట్టిపర్తి జానయ్య, షేక్ అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home