🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 04 October 2026, 5:06 pm Posted by : RK SAKSHI

విజయవాడ గురుస్వాముల సమ్మేళనం లో ముత్యంరాజు కు ఘనంగా సన్మానం

News Image

సూర్యాపేట :
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్.రంగు ముత్యంరాజు గురుస్వామి ని విజయవాడ నగరం లో జరిగిన గురుస్వాముల సమ్మేళనం లో ఘనంగా సన్మానించారు. విజయవాడ నగరం ఏ వి ప్యాలెస్ లో ఆదివారం అయ్యప్ప మహా సంకల్పం శంఖరావం కార్యక్రమం సందర్బంగా గురుస్వాముల సమ్మేళనం ను మహా సంకల్ప కార్యనిర్వాహక కమిటీ వారు నిర్వహించారు.ఈ సందర్బంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి డాక్టర్ రంగు ముత్యం రాజు గురుస్వామి ఇట్టి సమావేశం నకు అయ్యప్ప ధర్మ ప్రచార సభ ద్వారా హాజరైనారు. ఈ సందర్బంగా వారిని కమిటీ చైర్మన్ సి ఏ సుంకరి అక్కయ్య నాయుడు, ఏ బి ఏ పి జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్, రాష్ట్ర అధ్యక్షులు పుల్లం రాజు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నవంబర్ 22 నా విజయవాడ నగరం లో జరగనున్న అయ్యప్ప మహా సంకల్పం పూజ కార్యక్రమం విజవంతం అయ్యో విదంగా గురు స్వాములు, అయ్యప్ప స్వామి భక్తులు కృషి చేయాలని కోరారు. తనను సన్మానించిన కమిటీ సభ్యులకు ముత్యం రాజు గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home