డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ తోటలను సాగుచేయాలి. జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య
నేరేడుచర్ల :
ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి నాగయ్య అన్నారు మండల పరిధిలో నీ ఫేతేపురం గ్రామం లో తాటికొండ నారాయణమ్మ 10 ఎకరాలలో
నూతనంగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంను అయన ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు..ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది అని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు మరియు అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూపాయలు 4200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇవ్వబడును. గరిష్టంగా ఒక రైతుకు 12:50 ఎకరాల వరకు డ్రిప్పు రాయితీ వర్తిస్తుందనీ
నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందనీ మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయలని కోరారు.. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారిని ఎల్ ప్రదీప్తి మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి, సర్పంచ్ సురేష్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ మేనేజర్ అలీమ్ తహసీల్దార్ సైదులు,మండల వ్యవసాయ అధికారి జావీద్,
ఆయిల్ పామ్ సిబ్బంది రైతు లు తదితరులు పాల్గొన్నారు.