🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 10:01 am Posted by : RK SAKSHI

దామన్న కు ఘన నివాళులు అర్పించిన సపావట్ తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు

News Image

సూర్యాపేట రూరల్ :
మాజీ మంత్రి స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని తుంగతుర్తి లో ఇటీవల ఏర్పాటుచేసిన దామన్న విగ్రహానికి సూర్యాపేట మండల పరిధిలోని సపావట్ తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దామన్న లేని లోటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దామన్న అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్యకాంత రమేష్ నాయక్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శాంతాబాయి వెంకన్న నాయక్,ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్, బి.మహేష్,డి.రవీందర్ నాయక్,ఎం.బాలు నాయక్ తో పాటు పలువురు ఉన్నారు.
🏠 Home