🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 7:03 pm Posted by : RK SAKSHI

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

News Image
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, ఈ డిమాండ్ సాధనకు భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతా రెడ్డిని శుక్రవారం సూర్యాపేటలోని బిజెపి జిల్లా కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకి రెడ్డి మాట్లాడుతూ
హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాలని, జిల్లాలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను నిర్మించాలని కోరారు. సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, కారిడార్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
బుల్లెట్ ట్రైన్ కారిడార్ సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేస్తే జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతా రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధనకై తనవంతుగా కృషి చేస్తారని తెలియజేశారు. త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ ను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, బిజెపి నాయకులు తుకాని మన్మధ రెడ్డి, టీకుల్ల సాయి రెడ్డి, బండపల్లి పాండురంగ చారి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home