🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 6:11 pm Posted by : RK SAKSHI

*జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్న సూర్యాపేట ఫోటోగ్రాఫర్ మడూరి బ్రహ్మచారి*

News Image

సూర్యాపేట: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పత్రిక ఫోటోగ్రాఫర్ మడూరి బ్రహ్మచారి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. శుక్రవారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వికాస్ క్యాంపస్లో 157 వ గాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన ఫోటోలలో రెండింటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రియేటివిటీ ఆఫ్ కల్చర్ కమిషన్ గౌట్ ఆఫ్ ఏపీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దేశ స్థాయిలో నిర్వహించిన పోటీలలో ప్రదర్శించగా జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు దక్కింది.ఆయనకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, రిజిస్టర్ సింహాచలం, మల్లికార్జున రావు శివ వరప్రసాద్, ప్రిన్సిపాల్ సురేష్ కుమార్, తమ్మా శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయనకు ధృవ పత్రం, నగదుతో పాటు శాలువుతో సన్మానించారు.జాతీయ స్థాయిలో తెలంగాణలోని సూర్యాపేటకు పేరు తెచ్చిన సందర్భంగా ఆయనకి
పలువురు నాయకులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.
🏠 Home