పిల్లలమర్రి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సూర్యాపేట:
జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి సందర్భంగా శుక్రవారం పిల్లలమర్రి లో జేర్రిపోతుల సందీప్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు పండ్లు పంపిణీ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు నాయకత్వం వహించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తి ని నింపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాపర్తి శంకర్ గౌడ్, కడారి శివ, రాచకొండ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.