🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 30 September 2026, 3:37 pm Posted by : RK SAKSHI

ఎల్ఆర్ఎస్ ను సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిరంతరం కొనసాగించాలి.

News Image

సూర్యాపేట, సెప్టెంబర్ 30.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ విధానాన్ని నిరంతరం కొనసాగించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ ను సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పాత పద్ధతిలోనే ఎల్ఆర్ఎస్ ను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్న భూములకు నాలా కన్వర్షన్ మీదనే ఫ్లాట్లకు నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఎల్ ఆర్ ఎస్ కోసం 2020 సంవత్సరంలో పదివేల రూపాయలు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పక్కాభవాల భవనాలు లేని చోట స్థలం నిధులు కేటాయించి అన్ని మౌలిక వసతులతో నూతన భవనాలు నిర్మించి అందుబాటులోకి తేవాలని అన్నారు. 22 ఏ నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు, జలగం సత్యం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, రాష్ట్ర కార్యదర్శి కంభంపాటి అంజయ్యగౌడ్ గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, అయితే గాని మల్లయ్య గౌడ్, రాపర్తి జానయ్య, విన్ను, నరేష్, పట్టేటి కిరణ్, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, సారగండ్ల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home