🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 30 September 2026, 1:14 pm Posted by : RK SAKSHI

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి ఎం సి పి ఐ యు

News Image

సూర్యాపేట టౌన్ :
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఎం సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎం సి పి ఐ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం సూర్యాపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎం ఆర్ ఓ కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందారని,
హామీలలో భాగంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు పెంచాలని, దసరా పండుగ కానుకగా అందించాలన్నారు. మహిళలకు 2,500 హామీ తక్షణమే అమలు చేయాలని,వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలను అమలు చేయాలని, కౌలు రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని,ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 హామీని అమలు చేయాలని కోరారు. 60 గజాల ప్రభుత్వ స్థలంలో ఇండ్లు వేసుకున్న వారికి ఇంటి పట్టా ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, ప్రభుత్వ భూములను కాపాడి భూమిలేని పేద ప్రజలకు పంచాలని, ప్రభుత్వ వైద్యం ప్రోత్సహించి ప్రైవేటు వైద్య దోపిడిని నియంత్రించే చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి వచ్చేవరకు ప్రభుత్వం నెలకు 5,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు లింగంపల్లి రాజు, వైభవ్, చంద్రపట్ల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home