22-ఏ భూములపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధపడాలి ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేయొద్దు: పటేల్ రమేష్‌రెడ్డి
సూర్యాపేట: 22-ఏ నిషేధిత భూముల అంశంపై శాసనసభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు కూడా చర్చకు రావాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇబ్బందులు లేకుండా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిగితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు చర్చకు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను శాసనసభలో ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందన్నారు.కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించిన అంశాలపై విచారణ జరపాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూములు ఉంటే వాటిని గుర్తించి అర్హులైన పేదలకు అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తులపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి ఆస్తులు పదవుల్లోకి రాకముందు ఎంత ఉన్నాయి.. పదవుల అనంతరం ఎంత పెరిగాయనే అంశంపై విచారణ జరపాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, పేదలకు ప్రయోజనం కలిగేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలు, భూముల అంశాలపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన జాతర మేళాకు సుమారు 40 వేల మంది హాజరయ్యారని, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, సర్పంచ్ భూక్యా రాజు నాయక్, నాయకులు జ్యోతి కరుణాకర్, పిల్లల రమేష్ నాయుడు, వల్దాస్ దేవేందర్, పాలగాని కృష్ణ, తండు శ్రీనివాస్ గౌడ్, ధర్మ నాయక్, బొప్పని శ్రీకాంత్, కరుణాక రెడ్డి, కుంచం అంజయ్య, పాలకుర్తి వెంకట్, లక్ష్మాయ్య తదితరులు పాల్గొన్నారు.