🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 20 September 2026, 6:50 pm Posted by : RK SAKSHI

*వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలి* *ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ నరసింహ*

News Image

సూర్యాపేట: వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టౌన్షిప్‌ లక్ష్మీ అపార్ట్మెంట్‌లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా నిర్వహించాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాల్లో నిర్వాహకులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎక్సేంజ్ సూపర్డెంట్ అనిత, గుణగంటి కృష్ణ, మట్టపల్లి రాధాకృష్ణ, మట్టపల్లి ప్రసాద్, సోమయ్య, గిలకత్తుల కేశయ్య, శ్రీనివాస నాయుడు, అనంతరెడ్డి, శ్యామ్, ఝాన్సీ రాణి, అరుణ, సరిత, రూప, కృష్ణవేణి, శైలజ, మాధవి, దీపిక తదితరులు పాల్గొన్నారు.
🏠 Home