*పాస్టర్ గుద్దేటి పాపమ్మ @ సువార్తమ్మ (101) ఇక సెలవు* *పార్దివా దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పాస్టర్స్* *బిషప్ డా దుర్గం ప్రభాకర్* తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు
సూర్యాపేట : ఆత్మకూర్ (యస్ ) మండల కేంద్రంలోని X రోడ్డు నందు క్రీస్తూ ప్రేమ పరిశుద్ధ సహవాస సంఘం వ్యవస్థాపకురాలు పాస్టర్ గుద్దేటి పాపమ్మ ( సువార్తమ్మ ) శుక్రవారం 18వ తేది న ప్రభు నందు నిద్రించ్చరనీ ఆమె మరణం సంఘానికి మరియు కుటుంబ సభ్యులకు తీరని లోటనీ తన నివాసం చర్చి లో వారి కొరకు ప్రార్ధించి ఆమె పార్ధివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ వారు మాట్లాడుతూ గొప్ప దైవజనురాలును సూర్యాపేట ప్రాంత వాసులు కోల్పోయినమని కీ. శే. గుద్దేటి పాపమ్మ @ సువార్తమ్మ (101) సంవత్సరాలు బ్రతికిందని ఆమె చివరి వరకు కూడా తన పని తనే చేసుకునేదని, గొప్ప ప్రార్ధన పరురాలు అది మాత్రమే కాకుండా గత 40 సంవత్సరాల క్రితం కీ. శే. అపోస్తులు పాస్టర్ రెవ.జలగం పేతురు చే డబ్ల్యూ.యం.ఇ. నెమ్మికల్ సంగం ద్వారా మారుమనస్సు రక్షణ బాప్తిస్మము పొంది గత 35 సం. రాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు సేవా చేస్తూ అనేకమందినీ ప్రభువైపు నడిపించిందని ఆత్మకూర్ మరియు కోటపహాడ్ రెండు గ్రామాల్లో సంఘాలను నడుపుతూ.. ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులకు, క్రైస్తవులకు మంచి ససంబంధం కలిగిన వ్యక్తి అనీ బాధను వ్యక్తపరుస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించినారు.వారితో చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ జాటోత్ డేవిడ్ రాజు, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, ఆత్మకూర్ ( యస్ ) మండలం అధ్యక్షులు రెవ. డా. గుంటూరు శాంతాయ్య,సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రీస్థోఫర్, చివ్వేంల మండలం అధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్, రెవ. డా.పంది మార్కు, వరికుప్పల మత్తయి, బానోత్ సుధాకర్, శ్యాగ యాకోబు, బొల్లెద్దు మోష,పిట్టల సామెల్, సైదా నాయక్ పెద్ద ఎత్తులో పాస్టర్స్ పాల్గొన్నారు. తన పెద్ద కుమార్తె తంగేళ్ల పూలమ్మ, మనమండ్లు కుటుంబ సభ్యులను సంఘ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమం లో బంధువులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.