🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 19 September 2026, 5:28 pm Posted by : RK SAKSHI

పట్టణ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..

News Image
సూర్యాపేట :
సూర్యాపేట పట్టణంలో శుక్రవారం నాడు జరిగిన బందుకు పూర్తిగా సహకరించిన వర్తక వ్యాపార వర్గాలకు మరియు హోటల్స్ యజమానులకు మెకానిక్ లకు బందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బుల్లెట్ ట్రైన్ సాధన సమితి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.శనివారం సుధా బ్యాంకు ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎండలను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు బందులో పాల్గొన్నారని తెలిపారు‌ సూర్యాపేట ప్రజల ఐకమత్యాన్ని ఈ బందు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశామని, బంధు కు మద్దతుగా నిలిచిన పాఠశాల కళాశాలల యజమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాధ్యాయ సంఘాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేశారు. బందులో బ్యాంకులు కార్పొరేట్ సంస్థలు షాపింగ్ మాల్స్ కూడా మూసివేయడం జరిగిందని వారు చెప్పారు. సూర్యాపేట బందు బుల్లెట్ ట్రైన్ సాధనలో ఒక కీలకమైన సంఘటన అని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దిరెడ్డి రాజా, బిఆర్ ఎస్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సిపిఎం పార్టి మల్లు, నాగార్జున రెడ్డి , నెమ్మది వెంకటేశ్వర్లు, సిపిఐ బూర వెంకటేశ్వర్లు, సిపిఐ ఎం ఎల్ మందాడి డేవిడ్, ప్రజాపంధా శివకుమార్, బిజెపి నుండి చల్లమల్ల నరసింహ, సలిగంటి వీరేంద్ర, ఎల్గూరి రామ్మూర్తి , కర్నాటి కిషన్, పెద్దిరెడ్డి గణేష్, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ జానకిరామిరెడ్డి, భూపతి రాములు తదితరులు పాల్గొన్నారు
🏠 Home