🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 19 September 2026, 5:20 pm Posted by : RK SAKSHI

శ్రీ సాయిగ్లోబల్ మల్టీ బ్రాండ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

News Image

సూర్యాపేట కల్చరల్, సెప్టెంబర్ 19: శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సాయిగ్లోబల్ యాజమాన్యం మట్టి వినాయకున్ని ప్రతిష్టించి అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేధిత లక్షాది అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డులోని శ్రీ సాయి గ్లోబల్ మల్టీబ్రాండ్ సర్వీసెస్ లో నిర్వహకులు దారపునేని శ్రీనివాస రావు ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాల్లో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు భక్తిమార్గాన్ని ఎంచుకోవడంతో మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాపర్తి భవానిశ్రీనివాస్, సర్పంచ్ లావుడ్యా శ్రీలతబాలాజీ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస నాయుడు, వల్లెం శేఖర్, కృష్ణారావు, శ్రీనివాసరెడ్డి, రేపాల శ్రీనివాస్, గొట్టిపర్తి శ్రీకాంత్, దారపునేని వెంకటేశ్వర్లు, రాజేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home