🏠 rksakshi.com
Watermark
Newspaper Logo
Date of Publish : 18 September 2026, 6:14 pm Posted by : RK SAKSHI

*బుల్లెట్ ట్రైన్ సాధనే లక్ష్యంగా ఉద్యమిద్దాం*.... బుల్లెట్ దీక్షలు ప్రారంభించి మాట్లాడిన పటేల్ రమేష్ రెడ్డి.

News Image

సూర్యాపేట:
సూర్యాపేటకు ముందుగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ జాతీయ రహదారి 65 మీదుగా అలాట్మెంట్ చేసే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఏర్పాటు చేసిన 36వ రోజు శుక్రవారం ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు దీక్షలో పాల్గొనగా దీక్షలు ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత 60 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ 36 రోజులుగా దీక్ష చేస్తున్న పాలకులు పట్టించుకోక విచారకరమన్నారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చుట లో పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష బుల్లెట్ ట్రైన్ సాధించుకోవడం కొనసాగుతున్న ఉద్యమానికి సంపూర్ణ సహకారమిస్తూ బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమ సాధనకు పాటుపడతామన్నారు. బుల్లెట్ ట్రైన్ ఉద్యమం మారుమూల ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు చేరిందని ఇక బుల్లెట్ ట్రైన్ ఇవ్వకపోతే సూర్యాపేట జిల్లా ప్రజలు వదిలే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న గీత కార్మికులకు పులదండలు వేసి ఆహ్వానించారు. ఈ దీక్షలో గీత కార్మికులు మడ్డి వెంకన్న, గుండు లింగయ్య, భూపతి వెంకన్న, గుండు నారాయణ, పల్స వెంకన్న, అంజయ్య, గిలకత్తుల అంజయ్య, మట్టి చిన్న వెంకన్న, మడ్డి వెంకటనారాయణ, గుండు చిన్న లింగయ్య, లు తమ వృత్తి పరంగా మొకూ ముస్తాదులతో దీక్షకు కూర్చోవడం తో పలువురని ఆకర్షించాయి. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి,నిమ్మల శ్రీనివాస్, మల్లు నాగార్జున రెడ్డి, జర్నలిస్టు భూపతి రాములు, డేవిడ్ కుమార్, వెలుగు వనిత ,వేల్పుల వెంకన్న, చలమల నరసింహ, బొమ్మగాని శ్రీనివాస్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home